CBIC Recruitment 2022: 8వ/10వ తరగతి అర్హతతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Oct 17, 2022 | 7:26 AM

భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌.. టిండల్‌, సుఖని, ఇంజిన్‌ డ్రైవర్‌, లాంచ్‌ మెషిన్‌, ట్రేడ్స్‌మ్యాన్‌, సీమ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

CBIC Recruitment 2022: 8వ/10వ తరగతి అర్హతతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
CBIC Recruitment 2022
Follow us on

భారత ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌.. 26 టిండల్‌, సుఖని, ఇంజిన్‌ డ్రైవర్‌, లాంచ్‌ మెషిన్‌, ట్రేడ్స్‌మ్యాన్‌, సీమ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 14, 2022వ తేదీలోపు సమర్పించాలి. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 25, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. చొప్పున జీతంతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

అడ్రస్: The Additional Commissioner(P&V), Commissionerate of Customs (Preventive), Jamnagar-Rajkot Highway, Near Victoria Bridge, Jamnagar -361001, (Gujarat).

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.