CAT-2021 : క్యాట్ రిజిస్ట్రేషన్ ఈ తేదీ నుంచి ప్రారంభం.. నవంబర్‌లో పరీక్ష

|

Aug 02, 2021 | 6:20 PM

CAT-2021 : కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో

CAT-2021 : క్యాట్ రిజిస్ట్రేషన్ ఈ తేదీ నుంచి ప్రారంభం.. నవంబర్‌లో పరీక్ష
Cat Exam
Follow us on

CAT-2021 : కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష. ఈ సంవత్సరం పరీక్షను నవంబర్ 28, ఆదివారం రోజున మూడు సెషన్లలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ క్యాట్ 2021 పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారం iimcat.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

ఈ ప్రవేశ పరీక్ష (క్యాట్ 2021 రిజిస్ట్రేషన్) కోసం ఆగస్టు 4 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, బోధ్ గయ, కలకత్తా, ఇండోర్, జమ్మూ, కాశీపూర్, కోజికోడ్, లక్నో, నాగ్‌పూర్, రాయపూర్, రాంచీ, రోహ్‌తక్, సంబల్‌పూర్, షిల్లాంగ్, సిర్మూర్, తిరుచిరాపల్లి, ఉదయపూర్, విశాఖపట్నం IIM లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

కనీసం 50% మార్కులు లేదా సమానమైన CGPA తో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు CAT 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, PWD విద్యార్థులు అర్హత పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత పరీక్ష చివరి సంవత్సరానికి హాజరయ్యే అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

CAT 2021 దరఖాస్తు రుసుము SC, ST, PWD అభ్యర్థులకు రూ.1100, ఇతర అభ్యర్థులకు రూ. 2,200 గా నిర్ణయించారు. పరీక్షను158 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గా నిర్వహిస్తారు. CAT ఉత్తీర్ణత ఐఐఎంలలో ప్రవేశానికి హామీ ఇవ్వదని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. CAT స్కోర్ అనేది అడ్మిషన్ ప్రాసెస్ కోసం అవసరాలలో ఒకటి మాత్రమే. అడ్మిషన్ ప్రక్రియలో అనేక ఇతర అంశాలు ఇనిస్టిట్యూట్‌లే పరిగణిస్తాయి.

పార్లమెంటులో ఉమ్మడి వ్యూహం.. రేపు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్. విపక్షాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆహ్వానం

Viral Video : పడి లేచిన కెరటం..! కిందపడ్డా గెలిచి నిలిచిన 4 ఏళ్ల చిన్నారి.. వీడియో అదుర్స్

AHA OTT: ఆహా నుంచి మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌.. ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..