MHA: సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ పరీక్ష ఇకపై తెలుగులోనూ రాయొచ్చు.. కేంద్రం కీలక ప్రకటన

|

Apr 16, 2023 | 1:29 PM

కేంద్రసాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే ఉద్యోగార్ధులు కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే కాకుండా స్థానిక భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష..

MHA: సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ పరీక్ష ఇకపై తెలుగులోనూ రాయొచ్చు.. కేంద్రం కీలక ప్రకటన
CAPF constable exam
Follow us on

కేంద్రసాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే ఉద్యోగార్ధులు కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే కాకుండా స్థానిక భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష నిర్వహణకు కేంద్ర హోంశాఖ శనివరాం ఆమోదం తెలిపింది. సీఏపీఎఫ్‌ల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతోపాటు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకుగానూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కలలను నెరవేర్చుకోవడానికి భాష అడ్డంకి కాకూడదనే దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హోంశాఖ తాజా నిర్ణయంతో ఇప్పటికే హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తోన్న (సీఏపీఎఫ్‌) కానిస్టేబుల్‌ పరీక్షను ఇకపై తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లోనూ రాసేందుకు అవకాశం కలుగుతుంది. 2024 జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది గ్రామీణ అభ్యర్థులు తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేందుకు వీలుకలుగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.