C-DAC Thiruvananthapuram Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) మంత్రిత్వశాఖకు చెందిన తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)లో.. అసిస్టెంట్ పోస్టుల (Assistant posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 8
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ (ఎంఏఎస్ బీ3) పోస్టులు: 2
జూనియర్ అసిస్టెంట్ (ఎంఏఎస్ బీ4) పోస్టులు: 4
క్లర్క్ పోస్టులు: 2
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.295
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: