కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్).. ఒప్పంద ప్రాతిపదికన 140 ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాప్ట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్/సొల్యూషన్ ఆర్కిటెక్ట్/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్/లీడ్ సెక్యురిటీ ఆపరేషన్ ఆర్కిటెక్ట్/లీడ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ఆపరేషన్ ఎక్స్‌పర్ట్/జావా/వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 12, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.