C-DAC Noida Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
వయోపరిమితి: మే 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: ఏడాదికి రూ.7.86 లక్షల నుంచి రూ.15.51 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: సీడ్యాక్, అకడెమిక్ బ్లాక్, బీ-30, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, సెక్టర్ 62, నోయిడా-201309.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీలు: జులై 2, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.