
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం) పోస్టులు 95, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులు 25 వరకు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టెలికాం ఆపరేషన్స్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ, బీటెక్ లేదా తత్సమాన ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. ఫైనాన్స్ పోస్టులకు సీఏ, సీఎంఏ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ, రాత పరీక్ష తేదీలు వంటి వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,900 నుంచి రూ.50,500 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటిస్తారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉద్యోగాల నోటిఫికేషన్, అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.