BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మొత్తం 1312 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా 1312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) – 982, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) – 330 ఖాళీలు ఉన్నాయి.
* హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి/ITI, రేడియో & టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ ఆపరేటర్/జనరల్ ఎలక్ట్రానిక్స్/డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులకు అప్లై చేసుకునే వారు రేడియో అండ్ టెలివిజన్/ఎలక్ట్రానిక్స్/ఫిట్టర్/10 ఉత్తీర్ణత/ITI సర్టిఫికేట్/కంప్యూటర్ సాఫ్ట్‌వేర్/ జనరల్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ హార్డ్‌వేర్/నెట్‌వర్క్ టెక్నీషియన్/డేటా ఎంట్రీ ఆపరేటర్/ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 12వ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ (PST) అండ్ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 20-08-2022న మొదలుకాగా 19-09-2022తో చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..