BSF Head Constable Jobs 2025: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1121 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు!

డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) గ్రూప్‌ సి నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

BSF Head Constable Jobs 2025: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1121 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు!
BSF Head Constable Recruitment

Updated on: Aug 25, 2025 | 3:41 PM

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) గ్రూప్‌ సి నాన్‌ గేజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1121 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) పోస్టులు 910, హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) పోస్టులు 211 వరకు ఉన్నాయి.

పదో తరగతి అర్హతతోపాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. దీనితోపాటు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వరకు గరిష్ఠంగా వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.