BSF Constable Recruitment 2022: దేశ సరిహద్దుల్లో దేశం కోసం పనిచేయాలనే యువకులకు గుడ్‌న్యూస్. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2,788 పోస్టులను భర్తీ చేయాలని ఫోర్స్ చూస్తోంది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులులో బీఎస్ఎఫ్ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ వార్తలలో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 45 రోజులలోపు పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- జనవరి 15, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- మార్చి 1, 2022
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు
పురుషులు: 2651 పోస్ట్‌లు
స్త్రీ: 137 పోస్ట్‌లు
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
కనీస వయోపరిమితి- 18 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి)
గరిష్ట వయోపరిమితి- 23 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి)
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: జీతం వివరాలు
అభ్యర్థులు పే మ్యాట్రిక్స్ లెవల్-3లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లో పోస్ట్ చేయబడతారు, పే స్కేల్- 21,700 -రూ. 69, 100,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా కేటాయించబడే ఇతర అలవెన్స్.
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: అధికారిక నోటిఫికేషన్
బీఎస్ఎఫ్ జవాన్ రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇవి కూడా చదవండి: Holidays Extension: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యా సంస్థల సెలవులు పొడిగింపు
Omicron Variant: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..