BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

BECIL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా...

BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Becil Jobs

Updated on: May 15, 2021 | 3:44 PM

BECIL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా మెడిక‌ల్ రికార్డ్ టెక్నీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ఉద్యోగుల‌ను నియ‌మించుకోనున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టు వివ‌రాలు..

* మొత్తం 28 మెడిక‌ల్ రికార్డ్ టెక్నీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో… జ‌న‌ర‌ల్ 13, ఓబీసీ 4, ఎస్సీ 6, ఎస్టీ 2, ఈడ‌బ్ల్యూఎస్ 3 ఖాళీల‌ చొప్పున కేటాయించారు.

* ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు.. డిగ్రీలో బీఎస్పీ మెడిక‌ల్ రికార్డ్స్ ఉత్తీర్ణ‌త లేదా ఇంట‌ర్‌లో సైన్స్ గ్రూప్ చేసి మెడిక‌ల్ రికార్డ్స్‌లో ఆరు నెల‌ల డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త, ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి రాత ప‌రీక్ష అవ‌స‌రం లేదు.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. 750 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్‌, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.450 చెల్లించాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీగా మే 31ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు www.becil.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Secunderabad Military College: సికింద్రాబాద్ మిలిట‌రీ కాలేజీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

SBI Admit Card: ఎస్‌బీఐ స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..