భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న 2826 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగానే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2826 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సెంట్రల్ సూపరింటెండెంట్ (314 ), అసిస్టెంట్ సూపరింటెండెంట్ (628), ఆఫీస్ అసిస్టెంట్ (314), ట్రైనర్ (942), ఎంటీఎస్ (628) ఖాళీలు ఉన్నాయి.
* సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులకు 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రైనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్‌డ్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 05-02-2023ని చిరవి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..