BIRED Rajendranagar Training Programme: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..! హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(బీఐఆర్‌ఈడీ) 2023-24 సంవత్సరానికి స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) చెందిన నిరుద్యోగ పురుష అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత భోజన సదుపాయంతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు బీఐఆర్‌ఈడీ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కోర్సుకు బీకాం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగిలిన కోర్సులకు పదో తరగతి పాసైతే చాలు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజనీరింగ్ డిగ్రీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు అనర్హులు. 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 3, 2023. శిక్షణ వ్యవధి 37 రోజులపాటు ఉంటుంది. మొత్తం సీట్ల సంఖ్య 75. మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ అధికంగా దరఖాస్తులు అందితే సింపుల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇతర సందేహాలకు 040-29709295, 29709296 ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.