BHEL Recruitment 2022: సివిల్ విభాగంలో ఇంజనీర్లు, సూపర్‌వైజర్ల పోస్టులకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో, అభ్యర్థులు భారతదేశంలోని వారి ప్రాజెక్ట్ సైట్‌లలో పూర్తి ప్రాతిపదికన(రెగ్యూలర్) నియామకం కోసం దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక BHEL వెబ్‌సైట్, https://pser.bhel.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తులను జనవరి 11, 2022లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
BHEL రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తుల కోసం ముఖ్యమైన తేదీలు:
– డిసెంబర్ 28, 2021 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. వీటిని బీహెచ్‌ఎల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ సమర్పించొచ్చు.
– ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 11, 2022.
-BHEL – PSWR, నాగ్‌పూర్ దరఖాస్తు ఫారమ్‌ల ప్రింట్ అవుట్‌లను జనవరి 14, 2022 వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
BHEL రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీలు
ఇంజనీర్ -10
సూపర్‌వైజర్ -26
జీతం:
ఇంజనీర్లు – రూ 71,040/- నెలకు
సూపర్‌వైజర్ -రూ. 39,670/- నెలకు
దరఖాస్తుదారుల వయస్సు 1 జనవరి 2022 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://pswr.bhel.com లేదా https://careers.bhel.in సందర్శించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా, అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌లను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా QR కోడ్‌తో పాటు “Sr. డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR) బీహెచ్‌ఈఎల్, పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్, 345 కింగ్స్‌వే, నాగ్‌పూర్ – 440001″కు పంపించాలి.
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?