BHEL: బీహెచ్‌ఈఎల్‌లో మెడికల్ స్టాఫ్‌ పోస్టుల భర్తీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. హైదరాబాద్‌లో కూడా..

|

Nov 11, 2021 | 5:24 PM

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా దేశంలోని పలు యూనిట్లలో ఖాళీగా ఉన్న మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను..

BHEL: బీహెచ్‌ఈఎల్‌లో మెడికల్ స్టాఫ్‌ పోస్టుల భర్తీ.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. హైదరాబాద్‌లో కూడా..
Bhel Jobs
Follow us on

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా దేశంలోని పలు యూనిట్లలో ఖాళీగా ఉన్న మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీలు ఉన్న యూనిట్లలో హెచ్‌పీఈపీ (హైదరాబాద్‌) కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా ఏయో యూనిట్లలో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 28 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* హెచ్‌ఈఈపీ(హరిద్వార్‌), హెచ్‌ఈఈపీ(భోపాల్‌), హెచ్‌పీఈపీ (హైదరాబాద్‌), పీసీ(చెన్నై), సీఎఫ్‌పీ(రుద్రపూర్‌), హెచ్‌పీవీపీ(వైజాగ్‌), ఎఫ్‌ఎస్‌ఐపీ(జగదీష్‌పూర్‌) యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 01.11.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 83,000 చెల్లిస్తారు.

* అభ్యర్థులను ముందుగా విద్యార్హతల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 25-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ.. జంకన్నది లేకుండా వీడియో గేమ్‌ ఆడుతున్న కుర్రాడు. ఈ వీడియో చూస్తే..

5G Spectrum: వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం!.. టెలికాం రంగంలో మరిన్ని మార్పులు..

Viral Video: గోడ నిండా తేనెతుట్టే.. చూస్తే షాకవ్వాల్సిందే.. దీని వెనుక పెద్ద కథే ఉంది