భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ .. 30 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. నవంబర్ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 15, 2022వ తేదీ రాత్రి 8 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్ 18వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 1:10 ప్రాతిపదికన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ.78,000లు, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు నెలకు రూ.43,550ల వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: AGM (HR), Bharat Heavy Electricals Limited, Electronics Division, P. B. No. 2606, Mysore Road, Bengaluru-560026.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.