BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో..

|

Aug 06, 2021 | 9:32 PM

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో...

BEL Recruitment: ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో..
Bel Recruitment
Follow us on

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో మొత్తం 511 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ట్రైయిన్‌ ఇంజనీర్ (308), ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (203) ఖాళీలను తీసుకోనున్నారు.
* పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌లో ఉత్తీ్ర్ణత సాధించి ఉండాలి.
* ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు ఫ్రెషర్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవ్చు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు మాత్రం రెండేళ్ల అనుభవం ఉండాలి.
* 01-08-2021 నాటికి ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 25 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకి అప్లై చేసుకునే వారి వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు ట్రైయినీ ఇంజనీర్‌ పోస్టులకు రూ. 200, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పని, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 15-08-2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..

Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..

Library Book: 50 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. గొప్ప సందేశమిచ్చిన కథనం