BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు బెల్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం అందుకోవచ్చు

|

May 14, 2023 | 1:42 PM

పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 10 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటల్‌వర్కింగ్‌, ల్యాబొరేటరీ, క్యూఏ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ..

BEL Recruitment 2023: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు బెల్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం అందుకోవచ్చు
BEL Pune
Follow us on

పూణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 10 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మెటల్‌వర్కింగ్‌, ల్యాబొరేటరీ, క్యూఏ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/మెటీరిషల్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో కనీసం 55శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్‌ 5, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు సంబంధిత డాక్యుమెంట్లను దరఖాస్తును పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,500ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

Dy. Manager – HR
BEL Optronic Devices Limited,
EL-30, ’J’ Block, Bhosari Industrial Area,
Pune- 411 026.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.