BEL Recruitment: మచిలీపట్నంలో బెయిల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..

|

Dec 06, 2021 | 8:15 PM

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో (బెల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉన్న యూనిట్‌లో ఈ పోస్టులు ఉన్నాయి...

BEL Recruitment: మచిలీపట్నంలో బెయిల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
Bel Jobs
Follow us on

BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో (బెల్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఉన్న యూనిట్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్‌ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎలక్ట్రానిక్స్‌ (06), మెకానికల్‌ (06), కంప్యూటర్‌ సైన్స్‌ (03) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్ ఫూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిన పనిలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 01-11-2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, రవీంద్రనాథ్‌ టాగూర్‌ రోడ్‌, మచిలీ పట్నం 521001, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 24-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Aladdin-Magic Carpet: నేలమీద, నీటిలోనూ నడిచే ‘ఫ్లోటింగ్ కార్పెట్‌’ సృష్టి.. నయా అల్లావుద్దీన్ వీధుల్లోనూ, సముద్రంపై చక్కర్లు

Akhanda: ‘అఖండ’పై హాలివుడ్ క్రిటిక్ సైమన్ అబ్రంస్ ప్రశంసల వర్షం.. ‘ఎఫిక్ ఫిల్మ్’ అంటూ కామెంట్

PM Modi Putin Summit: పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు