Aladdin-Magic Carpet: నేలమీద, నీటిలోనూ నడిచే ‘ఫ్లోటింగ్ కార్పెట్’ సృష్టి.. నయా అల్లావుద్దీన్ వీధుల్లోనూ, సముద్రంపై చక్కర్లు
Aladdin-Magic Carpet: అరేబియన్స్ నైట్స్.. అల్లావుద్దీన్ అద్భుత దీపం స్టోరీ పిల్లలనే కాదు.. పెద్దలను కూడా ఆకర్షిస్తాయి. ఈ స్టోరీలో అల్లావుద్దీన్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఓ చాపమీద ప్రయాణిస్తూ..
Aladdin-Magic Carpet: అరేబియన్స్ నైట్స్.. అల్లావుద్దీన్ అద్భుత దీపం స్టోరీ పిల్లలనే కాదు.. పెద్దలను కూడా ఆకర్షిస్తాయి. ఈ స్టోరీలో అల్లావుద్దీన్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఓ చాపమీద ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే ఇది కథల్లో మాత్రమే జరిగేది. తాజాగా ఓ యూట్యూబర్ RhyzOrDie నిజ జీవితంలో ఒక ‘ఫ్లోటింగ్’ కార్పెట్‌ని సృష్టించాడు. దీనిమీద వీధుల్లోనూ, సముద్రంలోనూ హాయిగా చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ కు చెందిన యుట్యూబర్ రైజోర్డీ ఎలక్ట్రానిక్ లాంగ్‌బోర్డ్ చుట్టూ PVC పైపు ఫ్రేమ్‌ను రూపొందించి ఈ ‘ఫ్లోటింగ్’ కార్పెట్‌ను సృష్టించాడు. అనంతరం అల్లావుద్దీన్ స్టైల్ లో దుస్తులు ధరించి ఈ ‘ఫ్లోటింగ్’ కార్పెట్ మీద దుబాయ్ వీధుల్లో, మార్కెట్ లో చక్కర్లు కొట్టాడు. 2021లో సరికొత్త వస్తువులను సృష్టించి ప్రశంసలను అందుకున్నాడు. నవంబర్‌లో అప్‌లోడ్ చేయబడిన రెండు వీడియోలు ‘అరేబియన్ నైట్స్’ కు దగ్గరగా ఉండడంతో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
తాజా రైజోర్డీ ‘ఫ్లయింగ్ మ్యాజిక్ కార్పెట్’ని సృష్టించి నిజ జీవతంలో అల్లాదీన్‌గా మారిపోయాడు. ఈ యూట్యూబర్ తన కొత్త క్రియేషన్‌లో తెల్లటి గౌను ధరించి దుబాయ్ వీధులు, మార్కెట్‌ల్లో తిరిగాడు.. ఈ ‘ఫ్లోటింగ్’ కార్పెట్ ని మాయా ముద్రగా పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ కార్పెట్ ను సముద్రంలో కూడా చక్కర్లు కొట్టే విధంగా తీర్చిదిద్దాడు.
కార్పెట్ ను సముద్రంలోకి తీసుకెళ్లే ముందు సర్ఫ్‌బోర్డ్‌కు కార్పెట్‌ను బిగించాడు. కార్పెట్ నీటి ఉపరితలంపై తేలేవిధంగా ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్‌తో కూడిన సర్ఫ్‌బోర్డ్ ను అమర్చాడు. దీంతో రీడర్ తెడ్డు వేసే అవసరం లేకుండా హ్యాపీగా సముద్రం మీద చక్కర్లు కొడుతున్నాడు. మ్యాజిక్ కార్పెట్ వీడియో పై చక్కర్లు కొడుతూ.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం RhyzOrDie వీడియో క్లిప్ 91,000 వ్యూస్ ను సొంతం చేసుకుంది.
Also Read: సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలుడి అలంకారంలో సిరులతల్లి .. అమ్మవారు ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాయిని నమ్మకం. .