AICTE Recruitment: టెక్నీకల్ డిగ్రీ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Sep 23, 2022 | 7:24 AM

AICTE Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కార్యాలయంలో ఉన్న..

AICTE Recruitment: టెక్నీకల్ డిగ్రీ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Aicte Jobs
Follow us on

AICTE Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా క్లౌడ్ ఆర్కిటెక్ట్, టెక్నాలజీ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

* సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు, మిగతా ఖాళీలకు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 11-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..