BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు… పదో తరగతి నుంచి పీజీ చేసిన వారికి అవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Mar 13, 2021 | 6:17 PM

BECIL Recruitment: బ్రాడ్‌క్యాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో పలు ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నొటిఫికేషన్‌ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ..

BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... పదో తరగతి నుంచి పీజీ చేసిన వారికి అవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Jobs In Becil
Follow us on

BECIL Recruitment: బ్రాడ్‌క్యాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో పలు ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నొటిఫికేషన్‌ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా మార్చి 29, 2021గా ప్రకటించారు. ఇక నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులు ఏంటి.? వాటికి అర్హత ఏంటి.? ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద-AIIAలో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా పర్సనల్‌ అసిస్టెంట్‌(1), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (3), ఆపరేషన్‌ థియేటర్‌ నర్స్‌ (3), స్టాఫ్‌ నర్స్‌ (11), మ్యూజియం కీపర్‌ (1), మిడ్ వైఫ్ (4), పంచకర్మ టెక్నీషియన్ (7), పంచకర్మ అటెండెంట్ (12), లిఫ్ట్ ఆపరేటర్ (4), లాండ్రీ సూపర్‌వైజర్ (1), CSSD అటెండెంట్ (1), వార్డ్ అటెండెంట్ (2), వర్కర్స్ (2), గ్యాస్ మెయిన్‌ఫోల్డ్ టెక్నీషియన్ (4) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన విషయాలు..

* దరఖాస్తు ప్రక్రియ మార్చి 13న ప్రారంభమై.. 29న ముగుస్తుంది.
* ఇక విద్యార్హతల విషయానికొస్తే పదో తరగతి నుంచి ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత పొందిన వారికి పోస్టులు ఉన్నాయి. ఏయో పోస్టుకు ఎవరు అప్లై చేసుకోవాలో పూర్తి నోటిషికేషన్‌లో తెలుసుకోవచ్చు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, మహిళా అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది.
* రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎన్నుకుంటారు.
* పోస్టును బట్టి రూ.15,492 నుంచి రూ.37,500 వరకు వేతనం లభిస్తుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా https://becilregistration.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘New Registration’పై క్లిక్‌ చేసి అందులో పేర్కొ్న్న అంశాలను ఫిల్‌ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో పొందొచు.

Also Read: GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

GIC Recruitment: డిగ్రీ, పీజీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం… ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడంటే..?

FCI Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ .. అర్హత ఏమిటంటే..!