BDL Recruitment: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

|

May 10, 2022 | 7:06 PM

BDL Recruitment: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ యూనిట్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు...

BDL Recruitment: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Bdl Jobs
Follow us on

BDL Recruitment: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ యూనిట్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్లు/ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు 36, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్లు 44 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్లు/ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌లో భాగంగా ఎలక్ట్రికల్‌, టూల్‌ డిజైన్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్స్‌ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, పెయింటర్‌, వెల్డర్‌, స్టెనోగ్రాఫర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌ వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పరీక్ష ఫీజుగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

* అభ్యర్థులను సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 14-05-2022న ప్రారంభమై 04-06-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..