Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియను పదో తరగతి ఫలితాల ఆధారంగా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇప్పుడు ఇందులో మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే ఇకపై ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను పాలిసెట్ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు పాలిసెట్ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా మండలి తాజాగా సవరించింది. పాలిసెట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి.. గత నెల నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కోసం కూడా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 25ను చివరి తేదీగా నిర్ణయించారు. ఇక వంద రూపాయల ఫైన్‌తో 27 వరకు, మూడు వందల రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: Priyamani: తెలుగులో బిజీ కానున్న ప్రియమణి.. ‘నీలాంబరి’లాంటి పాత్ర చేయాలనుందంటున్న సీనియర్ హీరోయిన్..
Akshay Kumar: వివాదంలో అక్షయ్ కుమార్ సినిమా.. మూవీ పేరు మార్చాలని డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం..