BARC Recruitment 2022: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. ఆసక్తిగల , అర్హత కలిగి ఉన్నవారు ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. ఇక రక్షణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC) సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 11 వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. గేట్ స్కోర్ లేదా ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉద్యోగ అర్హత – బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)లలో ఏదో ఒకటి చేసి, 26 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక – గేట్2021 22లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు – రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ – ఫిబ్రవరి 11
వెబ్‌సైట్: barconlineexam.in
ఇవి కూడా చదవండి: