AMDER Recruitment: ఏఎండీఈఆర్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Oct 10, 2021 | 7:32 AM

AMDER Recruitment 2021: అటోమిక్‌ మినరల్స్‌ డైరక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఏఎండీఈఆర్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌..

AMDER Recruitment: ఏఎండీఈఆర్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us on

AMDER Recruitment 2021: అటోమిక్‌ మినరల్స్‌ డైరక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఏఎండీఈఆర్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటోమిక్‌ ఎనర్జీ పరిధిలోని ఈ సంస్థలో మొత్తం 124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-బి, టెక్నీషియన్‌ – బి, అప్పర్‌ డివిజ్‌ క్లర్క్‌, డ్రైవర్‌, సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియోలజీ, ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రికల్‌, సివిల్‌, ల్యాబొరేటరీ, ప్లంబర్‌ వంటి విభాగులున్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ/ ఎన్‌సీవీటీ, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను సంబంధిత స్కిల్‌ టెస్ట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు పోస్టు ఆధారంగా రూ. 100 నుంచి రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Piyush Chawla: టీ20ల్లో పీయుష్‌ చావ్లా సరికొత్త రికార్డ్..! ఏంటో తెలుసుకోండి..

MAA Elections 2021: సండే బిగ్ డే.. తుది అంకానికి చేరిన సిని’మా’ కథ.. నేడే మా ఎన్నికలు…

Lakhimpur Kheri: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్ర అరెస్ట్..