ASRB Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 349 ఉద్యోగాలు.. నెల జీతం రూ.218200లు..

|

Oct 11, 2022 | 3:13 PM

భారత ప్రభుత్వ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్‌ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. 349 నాన్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ASRB Recruitment 2022: రాత పరీక్షలేకుండా.. అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 349 ఉద్యోగాలు.. నెల జీతం రూ.218200లు..
ASRB New Delhi Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్‌ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. 349 నాన్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, హెడ్‌ ఆఫ్‌ డివిజన్‌, హెడ్‌ ఆఫ్‌ రీజనల్ సెక్షన్‌/సెంటర్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ కమ్‌ హెడ్‌ తదితర పొజిషన్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డాక్టరల్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా పోస్టును బట్టి 47 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.1,44,200ల నుంచి రూ.2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.