Artillery Centre Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్టిలెరీ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో ఉన్న మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* డ్రాప్ట్స్‌మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఉండాలి.
* ఎంటీఎస్ పోస్టుల భర్తీకి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హతగా నిర్ణయించారు.
* బూట్‌మేకర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఎండీసీ పోస్టులకు 12 తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను ది కమాండెంట్ ఆర్టిలెరీ సెంటర్, ఇబ్రహీంబాగ్ లైన్స్, హైదరాబాద్, తెలంగాణ 500031 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25,000 నుంచి రూ. 81,000 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చూడగా ఫ్యూజ్‌లు ఔట్ !!