Army School Recruitment 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ, AWES తరపున దేశంలోని వివిధ ఆర్మీ పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ రేపటితో (28 జనవరి 2022న) ముగుస్తుంది. టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8700 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు AWES అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసేముందు అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని చదవాలి.
ఆర్మీ స్కూల్‌లో TGT, PGT, PRT ఉపాధ్యాయుల నియామకం కోసం విడుదల చేసిన ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ awesindia.comకి వెళ్లాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ 07 జనవరి 2022 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులకు 28 జనవరి 2022 వరకు సమయం ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌ను ఇలా నింపండి..
1. దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ awesindia.comకి వెళ్లండి.
2. హోమ్ పేజీలో న్యూ లింక్‌కి వెళ్లండి.
3. ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌కి వెళ్లండి.
4. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌పై క్లిక్ చేయండి.
5. అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా నమోదు చేసుకోండి.
6. రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
ఈ తేదీలను గుర్తుంచుకోండి
దరఖాస్తు ప్రక్రియ 7 జనవరి 2022, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీ 28 జనవరి 2022, అడ్మిట్ కార్డ్ తేదీ 10 ఫిబ్రవరి 2022 , పరీక్ష తేదీ 19, 20 ఫిబ్రవరి 2022, ఫలితాల తేదీ 28 ఫిబ్రవరి 2022
అర్హత & వయో పరిమితి
PGT పోస్ట్ కోసం దరఖాస్తుదారు తప్పనిసరిగా 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి B.Ed డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా దరఖాస్తుదారు మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. TGT పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారు 50% మార్కులతో B.Ed డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా దరఖాస్తుదారు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. పీఆర్‌టీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 50 శాతం మార్కులతో బీఎడ్ లేదా రెండేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ కలిగి ఉండాలి. ఫ్రెషర్‌లకు వయోపరిమితి 40 ఏళ్లలోపు ఉండాలి. అయితే టీచింగ్ అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితి 57 సంవత్సరాల వరకు ఉంటుంది.