ARCI Recruitment: హైదరాబాద్‌లోని ఏఆర్‌సీఐ ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ARCI Recruitment: ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ సంస్థ...
ARCI Recruitment: ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఫౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ సంస్థ హైదరాబాద్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ సైటింటస్టులు (5), ప్రాజెక్ట్ అసోసియేట్లు-2 (4), ప్రాజెక్ట్ అసోసియేట్ (1), ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్లు (07) ఖాళీలు ఉన్నాయి.
* ప్రాజెక్ట్ సైంటిస్టుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్ అసోసియేట్లు-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
* ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బీఎస్సీ/ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ. 20,000 నుంచి రూ. రూ. 60,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 02-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..