TS TET Exam: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై స్పందించిన మంత్రి సబితా..
TS TET Exam: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక జూన్ 12న టెట్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు..
TS TET Exam: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్లికేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక జూన్ 12న టెట్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్‌తో టెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయన్న వార్తలు వచ్చాయి. దీనికి కారణం.. టెట్ ఎగ్జామ్ జరగనున్న జూన్ 12వ తేదీనే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉంది.
దీంతో ఓ అభ్యర్థి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకే రోజు రెండు పరీక్షలు ఉంటే ఎలా హాజరు కావాలని అంటూ.. పరీక్షను వాయిదా వేయండని కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే దీనికి స్పందించిన కేటీఆర్ ఈ విషయాన్ని పరిశీలించాని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో పరీక్ష వాయిదా పడనుందా అన్న వార్తలు వచ్చాయి.
Request Minister @SabithaindraTRS Garu to consider https://t.co/3os4hO8jId
— KTR (@KTRTRS) May 21, 2022
అయితే తాజాగా ఈ విషయంపై సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. టెట్ పరీక్షను వాయిదా వేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చి చెప్పారు. ఇతర పోటీ పరీక్షలకు క్లాష్ అవకుండానే పరీక్ష తేదీని ఖరారు చేశామని చెప్పారు. మంత్రి ఇచ్చిన క్లారిటీతో టెట్ పరీక్షపై నెలకొన్న సందిగ్ధతకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది. ఇదిలా ఉంటే టెట్ ఈ నెల 12వ తేదీతో టెట్ అప్లికేషన్స్‌కు చివరి తేదీ ముగియగా.. మొత్తం 6,26,938 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈసారి టెట్ పరీక్షను పది భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..