APVVP Kadapa District Bio Medical Engineer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Kadapa District).. ఒప్పంద ప్రాతిపదికన బయో మెడికల్ ఇంజినీర్, కౌన్సెలర్ తదితర పోస్టుల (Bio Medical Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: బయో మెడికల్ ఇంజినీర్, కౌన్సెలర్, డెంటల్ టెక్నీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), YSR Kadapa District, AP.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 2, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.