AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Mela: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నేడు జాబ్‌ మేళా.. 250కిపైగా ఖాళీలు..

Job Mela: నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహిస్తోంది. మార్చి 26 (శనివారం) కూడా మరో జాబ్‌ మేళాను..

Job Mela: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నేడు జాబ్‌ మేళా.. 250కిపైగా ఖాళీలు..
Job Mela
Narender Vaitla
|

Updated on: Mar 26, 2022 | 7:34 AM

Share

Job Mela: నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఇటీవల జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహిస్తోంది. మార్చి 26 (శనివారం) కూడా మరో జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ జాబ్‌ మేళాను పుట్టపర్తిలోని మంగళకర డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకొని సంబంధిత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఏయే సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు.? ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* కియా మోటర్స్‌లో నీమ్‌ ట్రైనీ విభాగంలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునే వారు డిప్లొమా/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంపికై అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. పురుషులకు మాత్రమే అవకాశం.

* భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌ లిమిటెడ్‌లో అసెంబ్లింగ్‌ మొబైల్‌ ఫోన్స్‌ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు టెన్త్/ఇంటర్/బీఈ/బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. శ్రీసిటీలో పనిచేయాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

* టాటా ప్లేలో ప్రమోటర్స్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయసు 19 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

* వీటితో పాటు వినూత్న ఫెర్టిలైజర్స్‌లో సేల్స్‌ రిప్రెజిన్‌టేటివ్‌ పోస్టులు, kyungshin industrial mothersonలో నీమ్‌ ట్రైయినర్స్‌/ అసోసియేట్స్‌ ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా http://apssdc.in లింక్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.

* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్‌తో పాటు, విద్యార్హతల జిరాక్స్‌ కాపీలు, ఆధార్‌ వెంట తీసుకు రావాలి.

* ఇంటర్వ్యూలు శనివారం (మార్చి 26) మంగళకర డిగ్రీ కాలేజ్‌, పుట్టపర్తిలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం 9676673102, 8247027608 నెంబర్లను సంప్రదించండి.

పూర్తి వివరాలు..

Also Read: Yogi Cabinet: ఒకప్పుడు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..

Whatsapp: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా..?

Chanakya Niti: మీ ఇంట్లో లక్షి దేవి నిలిచి ఉండాలంటే ఈ తప్పులు అస్సులు చేయకండి.. అవేంటంటే..

Follow Us
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్