AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా..?

Whatsapp: ప్రస్తుతం వాట్సాప్‌ ట్రెడింగ్‌గా మారిపోయింది. అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ ఒకటి. ఈ యాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది మొదలు..

Whatsapp: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా..?
Subhash Goud
|

Updated on: Mar 25, 2022 | 9:47 PM

Share

Whatsapp: ప్రస్తుతం వాట్సాప్‌ ట్రెడింగ్‌గా మారిపోయింది. అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ ఒకటి. ఈ యాప్‌ లేనిది స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్ లో మునిగి తేలుతుంటారు. చాటింగ్‌లు, వాట్సాప్‌ స్టేటస్‌లతో బిజీగా ఉంటారు. అయితే యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలంటే ముందుగా మొబైల్‌లో ఆ నంబర్‌ సేవ్‌ చేసి ఉండాలి. అయినే చాటింగ్‌, మెసేజ్‌ (Messages)లు పంపేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ నంబర్‌ సేవ్‌ చేసుకోకుండా కూడా వాట్సాప్‌ మెసేజ్‌ పంపవచ్చు. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌ (Whatsapp)లో మెసేజ్‌ చేసే అవకాశం ఉంది. థర్డ్‌పార్టీ యాప్స్‌ (Third Party Apps)ను ఉపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మంది ఎదుర్కొన్న వాళ్లమే. ఇక వాట్సాప్‌లో నంబర్‌ లేకుండా మెసేజ్ ఎలా పంపాలి లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకోండి.

ముందుగా మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు http://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఉదాహరణకు మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు http://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. ఇక్కడ తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాత మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌. తరువాత మీరు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

ఇవి కూడా చదవండి:

BSNL 4G: ఈ ఏడాది చివరి నాటికి BSNL 4G సేవలను ప్రారంభిస్తాం.. పార్లమెంట్‌లో మంత్రి దేవుసిన్హ చౌహాన్

Puncture Guard Tyre: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ టైర్లకు పంక్చర్‌ అయినా గాలి బయటకు పోదు!