BSNL 4G: ఈ ఏడాది చివరి నాటికి BSNL 4G సేవలను ప్రారంభిస్తాం.. పార్లమెంట్‌లో మంత్రి దేవుసిన్హ చౌహాన్

BSNL 4G: భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఈ ఏడాది చివరి నాటికి 4G సేవలను ప్రారంభిస్తుందని, దీనితో టెలికాం (Telecom) కంపెనీ సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందని..

BSNL 4G: ఈ ఏడాది చివరి నాటికి BSNL 4G సేవలను ప్రారంభిస్తాం.. పార్లమెంట్‌లో మంత్రి దేవుసిన్హ చౌహాన్
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2022 | 8:21 PM

BSNL 4G: భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఈ ఏడాది చివరి నాటికి 4G సేవలను ప్రారంభిస్తుందని, దీనితో టెలికాం (Telecom) కంపెనీ సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో తెలిపింది. రాజ్యసభ (Rajyasabha)లో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీ ప్రశ్నలకు సమాధానమిస్తూ కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ (Devusinh Chauhan) ఈ సమాచారం ఇచ్చారు. సంస్థ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 2019 అక్టోబర్‌లో ప్రభుత్వం దీనికి సంబంధించి ప్యాకేజీని కూడా ప్రకటించిందని, ఆ తర్వాత కంపెనీలోని 70 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని చౌహాన్ చెప్పారు. చేపట్టిన పలు చర్యలను ప్రస్తావిస్తూ.. భూమిని సేకరించేందుకు, మార్కెట్‌ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చిందని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌పై ఫిర్యాదు..

కాగా, ప్రశ్నోత్తరాల సమయంలో చాలా మంది సభ్యులు BSNL సేవ దయనీయంగా ఉందని ఫిర్యాదు చేశారు. దేశంలో 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సంబంధించి.. ప్రభుత్వం ఇటీవలే నాలుగు కంపెనీలకు పైలట్ ప్రాతిపదికన స్పెక్ట్రమ్‌ను కేటాయించిందని, ఇందుకు సంబంధించి అవసరమైన విచారణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

మార్గనిర్దేశం చేయాలని ప్రభుత్వం TRAIని కోరింది:

స్పెక్ట్రమ్‌ను వేలం వేయడానికి వీలుగా ఈ ప్రక్రియకు మార్గనిర్దేశం చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ TRAIని కూడా ప్రభుత్వం కోరిందని చౌహాన్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు టెలికాం సేవలు భారత్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2014లో సగటున నెలకు 1జీబీ డేటా వినియోగం ఉండగా, ఇప్పుడు దాదాపు 15జీబీకి పెరిగిందని ఆయన చెప్పారు. డేటా ధరలు గణనీయంగా తగ్గాయని, ఒకప్పుడు జీబీకి రూ.270 ఉండేదని, ఇప్పుడు జీబీకి రూ.10కి చేరుకుందన్నారు. ఇది కాకుండా కాలింగ్ రేటు దాదాపు ఉచితం అందిస్తున్నాయన్నారు.

ఇది కాకుండా భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (BBNL), మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్ (MTNL)ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తో విలీనం చేసే పని జరుగుతోందని, ఈ విలీనానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ముందుగా ప్రత్యేక పర్పుల్ వెహికల్ (ఎస్‌పివి)ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. MTNL రుణం, ఆస్తులు, దాదాపు రూ. 26500 కోట్లు. అయితే ఈ SPVకి బదిలీ చేసిన తర్వాత మాత్రమే BSNL కార్యకలాపాలతో విలీనం చేయాలి.

ఇవి కూడా చదవండి:

Puncture Guard Tyre: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈ టైర్లకు పంక్చర్‌ అయినా గాలి బయటకు పోదు!

Bats: గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు నిద్రపోతాయి.. కారణం ఏమిటి..?

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా 8000 SIM కార్డ్‌లను బ్లాక్ చేసింది.. కారణం ఏంటంటే..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో