
అమరావతి, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్సై) పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
దాదాపు 1,51,288 మంది అభ్యర్ధులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 28న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 57,923 మంది అభ్యర్ధులు దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. వీరిందరికీ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించడానికి తాజాగా బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.
రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులలో ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆయ సెంటర్లలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీరంతా ఆగస్టు 14 నుంచి పీఎంటీ/ పీఈటీ సంబంధించిన కాల్ లెటర్లు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా స్టేజ్ 2 అప్లికేషన్ ఫాం తెచ్చుకోవాలని బోర్డు వివరించింది.
ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి.
ప్రభుత్వం వైద్య కాలేజీల్లో ఫీజులు 15 శాతం పెంచుతూ భారాన్ని పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఏంబీబీఎస్‌లో మాదిరిగానే పీజీ ఫీజులు పెంచుతూ ఆగస్టు 10న ఉత్తర్వులను జారీచేసింది. హైకోర్టు తీర్పునకు లోబడి ఈ ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులు, పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ట్యూషన్ ఫీజు కింద రూ.17,25,000 తీసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ తెల్పింది. ఈ నిబంధన 5 ప్రైవేట్ (మెడికల్ అండ్ డెంటల్) కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.