APSHC Recruitment: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డేటా ఎంట్రీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఏపీ స్టేట్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSHC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతపురంలోని సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

APSHC Recruitment: ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డేటా ఎంట్రీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Asha worker
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2022 | 8:24 AM

ఏపీ స్టేట్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSHC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతపురంలోని సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతో పీజీడీసీఏ లేదా బీఎస్సీ(కంప్యూటర్స్‌)/ బీకాం(కంప్యూటర్స్‌)/ బీటెక్(కంప్యూటర్స్‌)/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను టెక్నికల్ పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులను డిస్ట్రిక్ట్‌ హెడ్ హౌసింగ్ కార్యాలయం, అనంతపురం అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 14-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..