AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు..

|

Jan 04, 2022 | 6:45 PM

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది...

AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు..
Follow us on

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్3 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూర్పుగోదావరి జిల్లా-8, పశ్చిమగోదావరి జిల్లా 7, కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, చిత్తూరు-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1లో పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్‌), కంప్యూటర్‌ ప్రొషిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 19-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్‌సీ అధారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Omicron Lockdown Tension: భయం గుప్పెట్లో భారత్ ? మళ్ళీ ‘లాక్ డౌన్’ వైపు అడుగులు..(వీడియో)

Covid19 Restrictions: షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లపై కోవిడ్ ఆంక్షలు.. ఎన్నికల ర్యాలీలు మాత్రం భేషుగ్గా జరుపుకోవచ్చు!

PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?