APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో ఖాళీగా ఉన్న 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 151 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) – 72, మెడికల్ ఆఫీసర్ (యునానీ) – 26, మెడికల్ ఆఫీసర్ (హోమియో) – 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్‌నర్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ముందే రిజిస్టర్ అయి ఉంటే వివరాలతో లాగిన్ అయ్యి పోస్టులకు అప్లై చేసుకోవాలి.
* ఒకవేళ రిజిస్టర్ అయి ఉండకపోతే కొత్తగా రిజిస్టర్ అయి దరఖాస్తు చేసుకోవాలి.