AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు! రూ.1.15 లక్షల జీతం

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖల్లో 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్‌-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు వేతనం లభిస్తుంది..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు! రూ.1.15 లక్షల జీతం
APPSC Hostel Welfare Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 11, 2026 | 6:19 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్‌-II పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు

  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్) పోస్టుల సంఖ్య: 41
  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (ట్రైబల్ వెల్ఫేర్) పోస్టుల సంఖ్య: 23
  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్) పోస్టుల సంఖ్య: 33

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టులను బట్టి అభ్యర్థులకు విద్యార్హతలు నిర్ణయించారు. సోషల్ వెల్ఫేర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు బీఎడ్ లేదా బీటీ డిగ్రీ కలిగి ఉండాలి. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.) అర్హత ఉండాలి. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తించే అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఫీజు చెల్లించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పరిశీలించాలి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలకు సిద్ధం కావాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం

ఈ నియామకానికి సింగిల్ లెవెల్ ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు. పేపర్-2: ఎడ్యుకేషన్ – 150 మార్కులు.. రెండు పేపర్లకు కలిపి మొత్తం 300 మార్కులు కేటాయించారు. పరీక్షకు మొత్తం 300 నిమిషాల సమయం ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్ష సిలబస్, మార్కుల విధానం, నెగెటివ్ మార్కింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. దరఖాస్తు చేసుకునే ముందు ఏపీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us