అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీపై మార్చి 19 నుంచి మార్చి 21వ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. అభ్యంతరాలను ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేయాలని సూచించింది. మార్చి 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ వెల్లడిస్తారు. ఆ తర్వాత త్వరలోనే ఫలితాలను కూడా విడుదల చేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీపై అభ్యంతరాల నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా మార్చి 17న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో 91,463 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే 72.55 శాతం మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరైనట్లు కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో రెండు పేపర్ల ఈ పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాసేందుకు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో ప్రతిభకనబరచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దేశ వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.41,960 జీతంగా చెల్లిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.