
అమరావతి, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు చెందిన పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఏప్రిల్ 28, 29 తేదీల్లో వేర్వేరుగా జరగనున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారి నియామక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్ 28, 30 తేదీల్లో జరగనుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఏప్రిల్ 16న ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, సీనియర్ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఏప్రిల్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం పేపర్ 2, 28న ఉదయం పేపర్ 1 పరీక్ష ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27న ఉదయం పేపర్ 2 పరీక్ష, ఏప్రిల్ 28న ఉదయం పేపర్ 1 పరీక్ష జరగనుంది. ఏపీ ఫిషరీస్ సర్వీస్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలో భాగంగా ఏప్రిల్ 28న ఉదయం పేపర్ 1 పరీక్ష, ఏప్రిల్ 30న ఉదయం పేపర్ 2 పరీక్ష, మధ్యాహ్నం పేపర్ 3 పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రాత పరీక్ష ఏప్రిల్ 28న ఉదయం, మద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఏప్రిల్ 28, 29 తేదీల్లో జరగనుంది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు.
తెలంగాణలోని రుక్మాపూర్ సైనిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాలకు 1:10 నిష్పత్తిలో మెరిట్ జాబితా ప్రకటించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఈ విద్యార్థులు వైద్యపరీక్షలకు హాజరు కావాలని, వైద్యపరీక్షల షెడ్యూలు విద్యార్థుల మొబైల్ నంబరుకు పంపిస్తామన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో నిర్వహిస్తామన్నారు. మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో ఆరోతరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసిన విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా వెల్లడించామన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.