APPSC Hall Tickets: ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు!

ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్ 2022 పరీక్షలకు హాల్ టికెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

APPSC Hall Tickets: ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ 2022 హాల్‌ టికెట్లు విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు!
Appsc
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 7:01 PM

APPSC Departmental Test Hall Tickets 2022: ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్‌మెంటల్ 2022 పరీక్ష (APPSC Departmental Tests)లకు హాల్ టికెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలయ్యాయి. హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.inలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ పరీక్షలను మార్చి 4 నుంచి 9 వరకు నిర్వహించనుంది. ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ తేదీకి ముందే హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చివరి నిమిషంలో సర్వస్‌ బిజీగా ఉండే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు కమిషన్‌ సూచించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ, పరీక్ష రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల జాబితా వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్లను ఫాలో అవ్వాల్సిందిగా తెల్పింది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌ లేకపోతే పరీక్ష కేంద్రంలోపలికి అభ్యర్ధులను అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా ఈ పరీక్షలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.

Also Read:

Job Mela: నిరుద్యోగులకు అలర్ట్‌! తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో జాబ్‌ మేళా.. ఈ తేదీల్లోనే..