EFLU: హైదరాబాద్‌ ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..

|

Jan 15, 2022 | 6:50 AM

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) డిస్టెన్స్‌ విధానంలో ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

EFLU: హైదరాబాద్‌ ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..
Eflu
Follow us on

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) డిస్టెన్స్‌ విధానంలో ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి మొత్తం రెండేళ్లు కాగా గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయవచ్చు. కాంట్రాక్ట్‌ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. ప్రింట్‌, ఆడియో, వీడియో, ఆన్‌లైన్‌ రెఫరెన్స్‌ ద్వారా స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసైన్‌మెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది . మొదటి ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తనే.. రెండో ఏడాది ప్రవేశానికి అనుమతిస్తారు. అసైన్‌మెంట్‌లకు 25 శాతం, ఫైనల్‌ పరీక్షలకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది.

కోర్సు వివరాలివే..
ఇందులో ఏడాదికి నాలుగు చొప్పున రెండేళ్లలో మొత్తం ఎనిమిది కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో కోర్సుకు ఎనిమిది క్రెడిట్లు ఉంటాయి. కోర్సు మొత్తం మీద 64 క్రెడిట్లు ఉంటాయి. మొదటి ఏడాది అకడమిక్‌ రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌, ఇంట్రడక్షన్‌ టు లింగ్విస్టిక్స్‌, బ్రిటిష్‌ లిటరేచర్‌-1, బ్రిటిష్‌ లిటరేచర్‌-2 అనే కంపల్సరీ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది సెకండ్‌ లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌, లిటరరీ క్రిటిసిజం అండ్‌ థియరీ అనే కంపల్సరీ కోర్సులు చదవాలి. ఆప్షనల్‌ కోర్సుల కింద అమెరికన్‌ పొయెట్రీ అండ్‌ డ్రామా, అమెరికన్‌ ఫిక్షన్‌, ఇండియన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌, పోస్ట్‌కొలోనియల్‌ లిటరేచర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ కోర్సుల నుంచి రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది

ఎవరు అర్హులంటే..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆంగ్ల మాధ్యమంలో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సు చేయడానికి అర్హులు. వారు ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగాచదివి ఉండాలి. వయోపరిమితికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. కోర్సుల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు కూడా ఉండవు. దరఖాస్తులు పరిశీలించి అడ్మిషన్లు ఖరారు చేస్తారు.
*ఇక ఫీజు వివరాలకొస్తే.. దరఖాస్తు ఫీజు + ప్రోగ్రామ్‌ ఫీజు కలిపి జనరల్‌ అభ్యర్థులు రూ.6,160, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3,740, దివ్యాంగులకు రూ.1,320 చెల్లించాల్సి ఉంటుంది.
*ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి
*దరఖాస్తులను డీన్‌, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ – 500007లకు పంపించాలి.
*మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇఫ్లూ అధికారిక వెబ్‌సైట్‌  ను సందర్శించవచ్చు.

Also Read: Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..

Horoscope Today: నేడు పెద్దల పండగ.. ఈరోజు ఏ రాశివారు ఎలాంటి రాశి ఫలాలను పొందుతారో తెలుసుకోండి..

Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?