ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మచిలీపట్నం జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ప్రవేశాలకు రూ.300, ఇంటర్మీడియట్‌కు రూ.400 చొప్పున అపరాధ రుసుము చెల్లించి డిసెంబరు 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.
అడ్మిషన్ ఫీజు డిసెంబర్ 13వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన అన్నారు. పదో తరగతికి అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరికి రూ.1300లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీస్/ఎక్స్‌సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళలకు రూ.900లు ఉంటుంది. ఇంటర్మీడియట్ అభ్యర్ధులకు జనరల్ కేటగిరికి రూ.1400లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీస్/ఎక్స్‌సర్వీస్‌మెన్/వికలాంగులు/మహిళలకు రూ.1100లు ప్రవేశ రుసుము చెల్లించవల్సి ఉంటుంది. వివరాలకు 8008403506 మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.
ఏపీ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.