APMS 2024: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి 2024-25 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏప్రిల్ 21న ఎంట్రన్స్‌ టెస్ట్

|

Mar 02, 2024 | 1:19 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆయా పరీక్షా కేంద్రాల్లో ఆదర్శ పాఠశాలల్లోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశ పరీక్ష..

APMS 2024: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి 2024-25 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏప్రిల్ 21న ఎంట్రన్స్‌ టెస్ట్
AP Model Schools
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆయా పరీక్షా కేంద్రాల్లో ఆదర్శ పాఠశాలల్లోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు లేదా ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులకు ఉచిత విద్యతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. మోడల్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే విద్యాబోధన జరుగుతుంది.

అర్హతలు ఏం ఉండాలంటే..

ఆసక్తి కలిగిన విద్యార్ధులు తప్పనిసరిగా సెప్టెంబర్‌ 1, 2009 నుంచి ఆగస్టు 31, 2013 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే సంబంధిత జిల్లాలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ పాఠశాలలో 2021-22, 2022-23 విద్యాసంవత్సరాలు చదివి ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఓసీ/బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.75 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 6వ తరగతిలో ప్రశేశాలు పొందగోరే విద్యార్ధులు ఈ ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు రావాలి. విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా మాత్రమే సీట్లను కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష క్వశ్చన్‌ పేపర్‌ లోని ప్రశ్నలన్నీ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో మాత్రమే ఉంటాయి. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి/మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చని కమిషనర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.