AP TET 2026 June: టీచర్ ఉద్యోగాలకు తొలి అడుగు.. ఏపీ టెట్‌ 2026 జూన్ నోటిఫికేషన్ విడుదల! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

AP TET June 2026 Notification: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ విద్యాశాఖ AP TET 2026 జూన్ సెషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్‌ 5 నుంచి అంటే నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీఈడ్‌, డీఎల్‌ఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు కూడా ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు..

AP TET 2026 June: టీచర్ ఉద్యోగాలకు తొలి అడుగు.. ఏపీ టెట్‌ 2026 జూన్ నోటిఫికేషన్ విడుదల! ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
AP TET June Notification

Updated on: Jun 05, 2026 | 3:00 PM

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (AP TET 2026) జూన్‌ 2026 సెషన్‌ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్‌ అర్హత తప్పనిసరి. కాబట్టి వీరంతా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 5, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత తప్పనిసరి. టెట్ అర్హత కలిగిన నిరుద్యోగులకు డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఏపీ టెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 40 నుంచి 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ లేదా బీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫైనల్ సెమిస్టర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలు కలిగిన వారు జులై 5, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద ప్రతి పేపర్‌కు ప్రతి ఒక్కరూ విడివిడిగా రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి టెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఆగస్ట్ 5 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. రాత పరీక్ష మొత్తం 150 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

ఇవి కూడా చదవండి

ఏపీ టెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 5, 2026 నుంచి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 5, 2026 వరకు
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలు: ఆగస్ట్ 5 నుంచి 21 వరకు
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: జులై 25, 2026 నుంచి
  • ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల: ఆగస్ట్ 24, 2026.
  • ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపే తేదీలు: ఆగస్ట్ 25 నుంచి 31 వరకు
  • తుది ఆన్సర్ కీ విడుదల తేదీ: సెప్టెంబర్ 8, 2026.
  • టెట్ ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2026.

ఏపీ టెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us