AP SI Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఎస్సై రాత పరీక్షకు మొదలైన కౌంట్‌డౌన్‌. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.

|

Feb 18, 2023 | 7:49 AM

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగుల రాత పరీక్షకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై రాత పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆదివారం...

AP SI Exam: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఎస్సై రాత పరీక్షకు మొదలైన కౌంట్‌డౌన్‌. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.
Ap Police Exam
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న ఎస్సై ఉద్యోగుల రాత పరీక్షకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై రాత పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి పేపర్‌, రెండో పేపర్‌ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్‌ను నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని అధికారులు తెలిపారు.

పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గత నవంబర్ నెలలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 421 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 1,40,453 మంది పురుషులు దరఖాస్తు చేసుకోగా, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరావాల్సి ఉంటుంది. కాగా, ఎస్సై పరీక్ష మొదటి పేపర్‌లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. హాల్‌టిక్కెట్‌తోపాటు గుర్తింపు కార్డు, బ్లాక్‌ లేదా బ్లూపాయింట్‌ పెన్‌తో హాజరుకావాలి. సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్యాగ్‌లు, బ్లూటూత్‌లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..