AP Polycet 2024 Revised Counselling: ఏపీ పాలీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ మారిందోచ్.. కొత్త తేదీలు ఇవే!

|

May 30, 2024 | 2:22 PM

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ధ్రువపత్రాల పరిశీలన మే 27 నుంచి జూన్‌ 3 వరకు ఉంటుంది. జూన్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉన్నందున్న రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది..

AP Polycet 2024 Revised Counselling: ఏపీ పాలీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ మారిందోచ్.. కొత్త తేదీలు ఇవే!
AP Polycet 2024 Revised Counselling
Follow us on

అమరావతి, మే 30: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ధ్రువపత్రాల పరిశీలన మే 27 నుంచి జూన్‌ 3 వరకు ఉంటుంది. జూన్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉన్నందున్న రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఈ కారణంగా పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో మార్పులు చేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పూ లేదని ఆమె అన్నారు. జూన్‌ 3న నిర్వహించాల్సిన ప్రక్రియను మాత్రం జూన్‌ 6వ తేదీకి మార్పు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

తొలుత ఇచ్చిన షెడ్యూల ప్రకారం మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. అయితే ఈ తేదీల్లో కూడా మార్పుచేసి జూన్‌ 7 నుంచి 10 వరకు కాలేజీలు, కోర్సులకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు. జూన్‌ 11న ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పిస్తారు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్ధులందరూ జూన్‌ 14 నుంచి 19 వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక జూన్‌ 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ మేరకు మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

కాగా ఈ ఏడాది పాలిసెట్‌ ఫలితాలు మే 8వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్ధులు హాజరవగా.. మొత్తం 1,24,430 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. వీరిలో బాలికలు 50,710 మంది, బాలురు 73,720 మంది ఉన్నారు. ఈ ఏడాది పాలీసెట్‌ ఉత్తీర్ణత మొత్తం 87.61 శాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 267 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉండగా వీటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.