AP Jobs: ఏపీలోని ఈ విభాగాలలో 4035 ఉద్యోగాలకు కేబినెట్‌ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్‌

|

Oct 29, 2021 | 9:03 PM

AP Jobs: ఏపీ కేబినెట్‌ అక్టోబర్‌ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో..

AP Jobs: ఏపీలోని ఈ విభాగాలలో 4035 ఉద్యోగాలకు కేబినెట్‌ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్‌
Follow us on

AP Jobs: ఏపీ కేబినెట్‌ అక్టోబర్‌ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ కేబినెట్ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 4035 ఉద్యోగాలను భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్ లలో 560 ఫార్మసిస్టులు, మెడికల్ కాలేజీల్లో 2,190 పోస్టులును నియమంచినున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

వీటితో పాటు కొత్తగా 1,285 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడులయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 26, 917 ఖాళీలను భర్తీ చేసింది. అలాగే వచ్చే ఏడాదిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకంపై చర్చించిన మంత్రివర్గం.. ప్రతి విద్యార్థికి 75శాతం హాజరు తప్పనిసరి అనే అంశంపై ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

EPF: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్‌..!